Corona alert! ఏపీలో 102 కొత్త కేసులు !
ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,157కు చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగించింది. రాష్ట్రంలోకి వలస కూలీల ప్రవేశంతో కరోనా కేసులు ఒక్కసారిగా సెంచరీ దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిల్స్ని పరీక్షించగా, 102 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లుగా వైద్యాధికారులు వెల్లడించారు. వీటిలో మహారాష్ట్ర కు చెందిన 34, రాజస్థాన్‌కు చెందిన 11 మంది స్వరాష్ట్రం చేరుకున్న వలస కూలీలవి.. మిగిలిన 57 కేసులు ఎపిలోని వివిధ జిల్లాలలో నమోదైనవిగా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఏపీ వ్యాప్తంగా వలస కూలీలతో కలుపుకుని 2307 కేసులు నమోదయ్యాయి. కాగా వీటిలో కరోనా నుంచి కోలుకుని 1252 మంది డిశ్చార్జ్ కాగా, .ప్రస్తుతం 857 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 150మందిలో కరోనా లక్షణాలు గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇక కేవలం ఏపీలో గడిచిన 24 గంటలలో కొత్తగా 57 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,157కు చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అందులో యాక్టివ్ కేసులు 857 ఉండగా, 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు మరణాల సంఖ్య 48కి చేరింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 1, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 3 కేసులు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు.
కాగా ఇప్పటి వరకూ కర్నూలులో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 599 కాగా గుంటూరు-404, కృష్ణా-360గా ఉన్నాయి. ఇక జిల్లాల వారిగా కరోనా కేసుల సంఖ్య పరిశీలిస్తే… అనంతలో 122, చిత్తూరు లో 165, తూర్పు గోదావరిలో 52, కడపలో 101, నెల్లూరు లో 140, ప్రకాశంలో 63, శ్రీకాకుళంలో 7, విశాఖ 68, పశ్చిమ గోదావరి జిల్లాలో 69 , విజయనగరంలో 7 కేసులు నమోదయ్యాయి..
