రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4974కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 185కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2377 కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 294 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6152కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 253 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రాల్లో రెండు మరణాలు సంభవించాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 84కి చేరింది. అలాగే 2,752 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More:
కరోనా వ్యాప్తిపై సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…
వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..