సీఎం కేసీఆర్‌కు జైకొట్టిన రాములమ్మ..!

| Edited By:

Apr 06, 2020 | 10:00 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఇది 12లక్షల మందిని ఆస్పత్రి పాలుచెయ్యగా.. 60వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ మహమ్మారి అదుపులోకి వచ్చిందనుకున్న క్రమంలో మర్కజ్ ఇష్యూతో మళ్లీ మొదటికొచ్చినట్లైంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. […]

సీఎం కేసీఆర్‌కు జైకొట్టిన రాములమ్మ..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఇది 12లక్షల మందిని ఆస్పత్రి పాలుచెయ్యగా.. 60వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ మహమ్మారి అదుపులోకి వచ్చిందనుకున్న క్రమంలో మర్కజ్ ఇష్యూతో మళ్లీ మొదటికొచ్చినట్లైంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక తెలంగాణలో కూడా సడన్‌గా కేసుల సంఖ్య పెరగడంతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. మళ్లీ సమస్యలు వస్తాయని.. ప్రధాని మోదీకి కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా లాక్‌డౌన్‌కు మధ్యలో విరామం ఇవ్వవద్దని.. పూర్తిగా అదుపులోకి తేవాలంటే.. మరికొన్ని రోజులు లాక్‌డౌన్ కొనసాగించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ విషయంలో తీసుకునే నిర్ణయాలకు.. తాను మద్దతు తెల్పుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ చైర్‌పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.