సీఎం ఆఫీస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు పాజిటివ్‌

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజా ప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. తాజాగా మణిపూర్‌లోని సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్‌కు..

సీఎం ఆఫీస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు పాజిటివ్‌

Edited By:

Updated on: Jul 27, 2020 | 6:24 AM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజా ప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. తాజాగా మణిపూర్‌లోని సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తున్న ఉద్యోగికి.. కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో సీఎం కార్యాలయంలోని దర్బార్ హాలుతోపాటు కార్యాలయాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని అంతా శానిటైజ్ చేశారు.

కాగా, మణిపూర్‌లో పలువురు వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి కూడా కరోనా సోకింది. దీంతో రెండు వైద్యకళాశాలలతోపాటు.. మరికొన్ని ప్రవేటు ఆస్పత్రులను క్లోజ్ చేశారు. ఇక రాజధాని ఇంఫాల్‌లోని రిమ్స్‌ను కరోనా ఆసుపత్రిగా మార్చారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. కర్ప్యూతో పాటుగా లాక్‌డౌన్ కూడా విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు.