రూ. 100ల‌కు 12 ర‌కాల కూర‌గాయ‌లు..ఇళ్ల వ‌ద్ద‌కే స‌రుకులు..

|

Apr 04, 2020 | 9:10 AM

నిత్యవసర వస్తువులైన కూరగాయలు, పాలు, పండ్లు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయాలంటే ప్ర‌జ‌లు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని

రూ. 100ల‌కు 12 ర‌కాల కూర‌గాయ‌లు..ఇళ్ల వ‌ద్ద‌కే స‌రుకులు..
Follow us on
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఎవ‌రూ ఇళ్ల‌నుంచి అడుగుబ‌య‌ట‌పెట్ట‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌ల‌లో కూడా స‌రుకు దొర‌క‌ని స్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా నిత్యవసర వస్తువులైన కూరగాయలు, పాలు, పండ్లు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయాలంటే అవస్థలు పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమిళనాడులో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రజల సౌకర్యార్ధం త‌మిళ స‌ర్కార్ స‌రికొత్త ఆలోచ‌న చేసింది. ప్రతి ఇంటికి చేరే విధంగా రూ.100లకే కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీని ప్రారంభించింది. ముఖ్యంగా కోయంబత్తూర్‌ మార్కెట్‌లో ప్రజల రద్దీని తగ్గించేందుకు రూ.100లకే 12 రకాల కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఎస్పీ వేలుమణి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోవై కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్‌లను ప్రజల ఇళ్ల వద్ద‌కే చేరుస్తామ‌ని చెప్పారు. మరో ప్యాకేజ్ కావాలంటే..మ‌రో వంద రూపాయ‌లు చెల్లించాల్సిందిగా తెలిపారు.