విదేశాల నుంచి వచ్ఛే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్

విదేశాల నుంచి ఇండియాకు వచ్ఛే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో ఏడు రోజులు తమ సొంత ఖర్చుతో క్వారంటైన్ కేంద్రాల్లోనూ, మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లోను ఉండాలని..

విదేశాల నుంచి వచ్ఛే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్

Edited By:

Updated on: May 24, 2020 | 5:57 PM

విదేశాల నుంచి ఇండియాకు వచ్ఛే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో ఏడు రోజులు తమ సొంత ఖర్చుతో క్వారంటైన్ కేంద్రాల్లోనూ, మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లోను ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని నింపి ఆరోగ్య శాఖ అధికారులకు అందించాలని సూచించింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. మైల్డ్ కేసులు ఉన్నవారు హోమ్ క్వారంటైన్ కి వెళ్లాల్సి ఉంటుంది..లేదా కోవిడ్ కేర్ సెంటర్లకు తరలాల్సి ఉంటుంది. అయితే కాస్త తీవ్రమైన కేసులవారిని కోవిడ్ హెల్త్ సెంటర్లకు తరలిస్తారని ఈ మార్గదర్శక సూత్రాల్లో కేంద్రం వివరించింది. .