కేంద్ర మంత్రి అమిత్‌షాకు క‌రోనా పాజిటివ్‌

| Edited By:

Aug 02, 2020 | 6:57 PM

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకీ కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, పలువురు సినీ, క్రీడా సెబ్రిటీల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు...

కేంద్ర మంత్రి అమిత్‌షాకు క‌రోనా పాజిటివ్‌
Follow us on

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకీ కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, పలువురు సినీ, క్రీడా సెబ్రిటీల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా క‌రోనా సోకింది. ఇటీవ‌లే అమిత్ షాలో క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గా.. క‌రోనా టెస్టులు చేయించుకున్న ఆయ‌న‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

ఈ మేర‌కు అమిత్ షా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు తాను ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ట్లు అమిత్ షా పేర్కొన్నారు. అలాగే గ‌త కొన్ని రోజులుగా త‌న‌ని కలిసిన వారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు అమిత్ షా. కాగా ఇప్పుడు అమిత్ షాకు కోవిడ్ సోక‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగుతోంది.

Read More:

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. 138 కొత్త ఎమోజీలు..

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!