ప్రధాని భార్యకు కరోనా.. వర్క్ ఇంటినుంచే

| Edited By: Pardhasaradhi Peri

Mar 13, 2020 | 11:59 AM

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోరీకి కరోనా సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓ వేడుకకు బ్రిటన్ వెళ్లి వచ్చిన ఆమెకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు కరోనా సోకిందని కన్ఫార్మ్ కావడంతో..

ప్రధాని భార్యకు కరోనా.. వర్క్ ఇంటినుంచే
Follow us on

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోరీకి కరోనా సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓ వేడుకకు బ్రిటన్ వెళ్లి వచ్చిన ఆమెకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు కరోనా సోకిందని కన్ఫార్మ్ కావడంతో.. భార్యతో పాటు ప్రధాని సైతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు ప్రకటించారు. తన భార్యకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో.. తాను కూడా ఇంటి వద్దనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహాల మేరకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రధాని జస్టిన్ పేర్కొన్నారు.

అలాగే ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రధాని.. ఫోన్ కాల్స్, మీటింగ్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటారని తెలిపారు. అయితే.. గత వారం నుంచి సోఫీని కలిసిన వారందరినీ గుర్తించి పరీక్షించనున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ తెలిపారు. దాదాపు 14 రోజుల పాలు ప్రధాని అతని భార్య ఇంటికే పరిమితం కానున్నారని ఆయన చెప్పారు. కాగా.. ఇప్పటికే కెనడాలో 138 మందికి ఈ వైరస్ సోకిందట.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు