మళ్లీ విజృంభిస్తున్న కరోనా… బ్రెజిల్‌లో ఒకే రోజు 968 మంది మృతి… ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే…

| Edited By:

Dec 23, 2020 | 1:34 PM

Brazil's Covid-19 death: బ్రెజిల్ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చారు.

మళ్లీ విజృంభిస్తున్న కరోనా... బ్రెజిల్‌లో ఒకే రోజు 968 మంది మృతి... ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే...
Follow us on

Brazil’s Covid-19 death: బ్రెజిల్ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చారు. డిసెంబర్ 22 న ఆ దేశంలో కరోనా మరణాలు 968 నమోదైయ్యాయి. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో ఒక లక్ష ఎనభై ఎనమిది వేల రెండు వందల యాభై తొమ్మిది(1,88,259) మంది కరోనా కారణంగా చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

దేశ వ్యాప్తంగా 73,18,821 మంది కరోనా బారిన…

బ్రెజిల్ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 73,18,821 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 63,54,972 మంది కోలుకున్నారు. ఆ దేశంలో గడిచిన 24 గంటల్లో 55,202 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, బ్రెజిల్‌లోని సౌత్ఈస్ట్ స్టేట్‌లో కరోనా ఉధ‌ృతి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించారు. అంతేకాకుండా అవసరమైతే తప్ప వ్యాపార సముదాయాలను తెరవవద్దని సూచించారు. బ్రెజిల్ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 25 నుంచి 27 వరకు, జనవరి 1 నుంచి 3 వరకు కరోనా లాక్‌డౌన్ నిబంధనలను తిరిగి అమలులోకి తీసుకొచ్చింది. ఉండనున్నాయి.