బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 52,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,09,360కి చేరింది. ఈ విషయాన్ని బ్రెజిల్ ఆరోగ్య మంత్రి
వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లొ కరోనా బారినపడి 1,274 మంది మరణించారు. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,026 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 23,69,860 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19.9 మిలియన్లకు
పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. ఇప్పటి వరకు 7.32 లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.
Read More :
ఆస్పత్రి మెడికల్ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు