కరోనా కట్టడికి ‘స్వచ్ఛంద లాక్‌డౌన్’ – మంత్రి బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కార్ వ్యూహాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే జిల్లాకు నాలుగు సంజీవని బస్సులు కేటాయించారని చెప్పారు. విజయనగరంలో జిల్లాలో...

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కార్ వ్యూహాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే జిల్లాకు నాలుగు సంజీవని బస్సులు కేటాయించారని చెప్పారు. విజయనగరం, ఆర్టీసీ ఆధ్వర్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన రెండు సంజీవని మొబైల్ కోవిడ్ నిర్ధారణ బస్సులను విజయనగరం బస్ స్టేషన్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ప్రారంభించారు..అనంతరం స్వయంగా సంజీవని మొబైల్ టెస్టింగ్ బస్సులో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు.. మంత్రి బొత్సకు నెగటివగ్ గా నిర్ధారణ అయింది. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా జిల్లా అంతటా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. కరోనా అనుమానితులు ఉన్నవారు వెంటనే హెల్ప్ లైన్‌కి కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో నేటి నుంచి వైద్య చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సను అందజేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా చికిత్స పొందిన వారికి ప్రత్యేక భృతి అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 52535 శాంపిల్స్ సేకరించామని, వీరిలో 50156 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 1073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని 425 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. నేటి నుంచి జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, కరోనా పరీక్షల నిర్వహణ కోసం ఏపీ సర్కార్ జిల్లాకు నాలుగు చొప్పున ప్రత్యేక బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చింది. రాష్ట్రం మొత్తానికి 52 బస్సులు అందుబాటులోనికి వచ్చాయి. ప్రజలు సహకరించి పరీక్షలకు ముందుకు రావలసిన అవసరం ఉందని సర్కార్ పేర్కొంది.




