వారి సమాచారం చెప్తే రూ.11వేల బహుమానం.. బీజేపీ ఎంపీ ఆఫర్..

| Edited By:

Apr 25, 2020 | 8:54 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో ఇంకా పలుచోట్ల కరోనా  అనుమానితులు బయటికి రావట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మర్కజ్ తబ్లీఘీ సమావేశానికి వెళ్లిన వారిలో ఇంకా కొంతమంది దాక్కున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా యూపీలో రెండు మసీదుల్లో విదేశీయులు బయటపడటం.. ఆ తర్వాత మరోచోట కూడా తబ్లీఘీ సమావేశానికి వెళ్లిన వారు బయటపడటంతో కలకలం  రేగింది. వీరిలో ఎంతమందికి […]

వారి సమాచారం చెప్తే రూ.11వేల బహుమానం.. బీజేపీ ఎంపీ ఆఫర్..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో ఇంకా పలుచోట్ల కరోనా  అనుమానితులు బయటికి రావట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మర్కజ్ తబ్లీఘీ సమావేశానికి వెళ్లిన వారిలో ఇంకా కొంతమంది దాక్కున్నట్లు అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. తాజాగా యూపీలో రెండు మసీదుల్లో విదేశీయులు బయటపడటం.. ఆ తర్వాత మరోచోట కూడా తబ్లీఘీ సమావేశానికి వెళ్లిన వారు బయటపడటంతో కలకలం  రేగింది. వీరిలో ఎంతమందికి కరోనా సోకిందన్న దానిపై పరీక్షలు చేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీకి చెందిన ఎంపీ రవీంద్ర కుష్వా.. ఓ ఆఫర్ ప్రకటించారు. మర్కజ్ సమావేశానికి వెళ్లి..ఇంకా బయటికి రాకుండా దాక్కున్న వారి వివరాలు చెబితే రూ.11వేల పారితోషికం ఇస్తానంటూ ప్రకటించారు.

తబ్లీఘీ మీటింగ్‌ వెళ్లి వచ్చాక.. ఇంకా కూడా కొందరు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని.. అధికారులకు కనీసం రిపోర్ట్ కూడా చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ఉంటే.. వెంటనే స్థానిక అధికారులను కలిసి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.