‘ఆ మందుపై ఇంకా సందేహాలు’… నిపుణుల తర్జన భర్జన

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 1:33 PM

బయోకాన్ సంస్థ వారి ఉత్పాదన..'ఇటోలిజుమాబ్' మెడిసిన్ పై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మందును కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకు కూడా వినియోగించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. చర్మవ్యాధి సోరియాసిస్ చికిత్సకు వాడే ఈ మందును..

ఆ మందుపై ఇంకా సందేహాలు... నిపుణుల తర్జన భర్జన
Follow us on

బయోకాన్ సంస్థ వారి ఉత్పాదన..’ఇటోలిజుమాబ్’ మెడిసిన్ పై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మందును కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకు కూడా వినియోగించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. చర్మవ్యాధి సోరియాసిస్ చికిత్సకు వాడే ఈ మందును కరోనా రోగుల్లో కొద్దిమందికి మాత్రమే వాడారని, దీని ప్రయోజనాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కావలసి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ స్థాయి నుంచి విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఈ మెడిసిన్ ని వాడేందుకు తమకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించిందని బయోకాన్ ఈ నెల 12 న ప్రకటించింది. అటు-ఆక్సిజన్ తగినంత లేక ఆసుపత్రుల్లో వెంటిలేటర్ పై ఉన్న కరోనా రోగులకు ఈ మందును ఇచ్చాక వారు పూర్తిగా కోలుకున్నారని ఢిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ అంటున్నారు. కానీ దీన్ని తక్కువమంది రోగులకు ఇస్తున్నారని పలువురు నిపుణులు పెదవి విరిచారు.