Corona Vaccination: భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో కీలక అడుగు.. 12 నుంచి 18 ఏళ్ల వారికి అనుమతిస్తూ..

|

Dec 25, 2021 | 9:07 PM

Corona Vaccination: భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైన అస్త్రం వ్యాక్సిన్‌ అనే విషయాన్ని...

Corona Vaccination: భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో కీలక అడుగు.. 12 నుంచి 18 ఏళ్ల వారికి అనుమతిస్తూ..
Vaccine
Follow us on

Corona Vaccination: భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైన అస్త్రం వ్యాక్సిన్‌ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మన దేశంలో 18 ఏళ్లపై బడిన వారికే వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉంది. అయితే తాజాగా 12 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌ బయోటెక్‌ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 12-18 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. దీంతో కరోనాను అంతమోందించే దిశగా మరో అడుగు పడినట్లైంది. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మళ్లీ ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా మళ్లీ అప్రమత్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు దేశాలు బూస్టర్‌ డోసులు కూడా మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే తాజాగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ బూస్టర్ డోస్‌ను తయారు చేస్తోంది. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదనలను పంపించిన విషయం తెలిసిందే.