కొవాక్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

|

Sep 05, 2020 | 4:14 PM

బీమారిలా వచ్చి మహమ్మారిలా మారిన వైరస్‌ని ఎదుర్కొగల మందుల కోసం ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటు భారత సైంటిస్టులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్జిన్ కీలక దశకు చేరుకుంది.

కొవాక్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్
Follow us on

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనాని కట్టడి చేయగల సరైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. బీమారిలా వచ్చి మహమ్మారిలా మారిన వైరస్‌ని ఎదుర్కొగల మందుల కోసం ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటు భారత సైంటిస్టులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్జిన్ కీలక దశకు చేరుకుంది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్ కు కీలక అనుమతులు లభించాయి. ఈ వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా నిర్వహించగా.. ఆశాజనక ఫలితాలు రావడంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. రెండో దశ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.