భైంసాలో ప్రభుత్వాదేశాలు బేఖాతర్‌.. ఇలానే కొనసాగితే…

| Edited By:

Apr 03, 2020 | 2:40 PM

నిర్మల్ జిల్లా భైంసాలో స్థానికులు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఆదేశాలను తుంగలొ తొక్కేస్తున్నారు. ఇప్పటికే ఈ భైంసా పట్టణాన్ని ప్రభుత్వం హాట్‌ స్పాట్‌గా గుర్తించింది. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్ధనలకు వెళ్లిన వారు ఉన్న పలు ప్రాంతాలను ప్రభుత్వం హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించింది. ఇప్పటికే మార్కజ్ ప్రార్ధనలకు వెళ్లిన వ్యక్తి కరోనా పాజిటివ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటుగా.. […]

భైంసాలో ప్రభుత్వాదేశాలు బేఖాతర్‌.. ఇలానే కొనసాగితే...
Follow us on

నిర్మల్ జిల్లా భైంసాలో స్థానికులు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఆదేశాలను తుంగలొ తొక్కేస్తున్నారు. ఇప్పటికే ఈ భైంసా పట్టణాన్ని ప్రభుత్వం హాట్‌ స్పాట్‌గా గుర్తించింది. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్ధనలకు వెళ్లిన వారు ఉన్న పలు ప్రాంతాలను ప్రభుత్వం హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించింది. ఇప్పటికే మార్కజ్ ప్రార్ధనలకు వెళ్లిన వ్యక్తి కరోనా పాజిటివ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటుగా.. భైంసా పట్టణాన్ని కూడా హాట్‌స్పాట్‌ కేంద్రంగా గుర్తించింది ప్రభుత్వం.

అయితే ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. నిత్యావసర పనుల పేరుతో ప్రజలు యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. వాస్తవానికి హాట్‌స్పాట్ కేంద్రాలలో రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరగకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేసినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అక్కడ లాక్‌డౌన్ పాటించకుండా ఇలానే ఉంటే.. పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉన్నట్లు పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.