నిరాడంబ‌రంగా రాములోరి క‌ల్యాణం..ప్రత్యక్షప్రసారం

|

Apr 02, 2020 | 10:35 AM

భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఆల‌య అధికారులు య‌థావిధిగా నిర్వ‌హించ‌నున్నారు. భ‌క్తులు లేకుండా నిరాడంబ‌రంగా క‌ల్యాణ మ‌హోత్స‌వ వేడుక‌ను కొన‌సాగిస్తున్నారు. కేవ‌లం 40 మందికి మాత్రమే అనుమతి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలను స‌మ‌ర్పిస్తారు. ఆలయ అధికారులు సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్నిప్రత్యక్షప్రసారం చేయనున్నారు. https://www.youtube.com/watch?v=C5ZnfeUoLew ఏటా సీతారామ కల్యాణం […]

నిరాడంబ‌రంగా రాములోరి క‌ల్యాణం..ప్రత్యక్షప్రసారం
Follow us on
భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఆల‌య అధికారులు య‌థావిధిగా నిర్వ‌హించ‌నున్నారు. భ‌క్తులు లేకుండా నిరాడంబ‌రంగా క‌ల్యాణ మ‌హోత్స‌వ వేడుక‌ను కొన‌సాగిస్తున్నారు. కేవ‌లం 40 మందికి మాత్రమే అనుమతి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలను స‌మ‌ర్పిస్తారు. ఆలయ అధికారులు సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్నిప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=C5ZnfeUoLew
ఏటా సీతారామ కల్యాణం కన్నులపండువగా జ‌రుగుతుంది. ఎంతో ఆడంబరంగా ఆరుబయట నిర్వహించే రాములవారి కల్యాణాన్ని భక్తులంతా ఎక్కువ సంఖ్యలో తిలకించేందుకు వీలుగా నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సారి అందరికీ ఈ కల్యాణాన్ని తిలకించే యోగ్యం దక్కడం లేదు. కరోనా వైరస్ రాష్ట్రంలో రోజు రోజుకూ వ్యాప్తి చెందుతుండడం వల్ల ఈసారి స్వామివారి కల్యాణానికి భక్తులెవరూ రావొద్దని, అందరూ ఇందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆలయ అధికారులు సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్నిప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=C5ZnfeUoLew