బీజింగ్ లో మరో ‘కోయంబేడు’.. వార్ టైమ్ ఎమర్జెన్సీ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2020 | 5:29 PM

చైనా రాజధాని బీజింగ్ లో మరో 'కోయంబేడు' కనిపించింది. ( తమిళనాడులోని పెద్ద మార్కెట్... కోయంబేడులో  భారీ సంఖ్యలో కరోనా బాధితుల సంఖ్య ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే). సేమ్... అలాగే బీజింగ్ లోని..

బీజింగ్ లో మరో కోయంబేడు.. వార్ టైమ్ ఎమర్జెన్సీ !
Follow us on

చైనా రాజధాని బీజింగ్ లో మరో ‘కోయంబేడు’ కనిపించింది. ( తమిళనాడులోని పెద్ద మార్కెట్… కోయంబేడులో  భారీ సంఖ్యలో కరోనా బాధితుల సంఖ్య ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే). సేమ్… అలాగే బీజింగ్ లోని ఫెంగ్ తాయ్ జిల్లాలో గల ఓ హోల్ సేల్ మార్కెట్ లో కరోనా వైరస్ క్లస్టర్ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం ఈ మార్కెట్ కి వఛ్చిన సుమారు 517 మందిలో 45 మంది గొంతునొప్పి, స్వల్ప జ్వరం వంటి రుగ్మతలతో బాధ పడ్డారు. వీరందరికీ కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇతరులకు కూడా ఈ వైరస్ సోకుతుందని భయపడుతున్నారు. అంటే కోవిడ్-19 న్యూ వేవ్ తలెత్తిందని కూడా ఆందోళన చెందుతున్నారు. ఆసియాలోనే ఇది అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ అంటున్నారు. ఇక్కడికి ప్రతి రోజూ 1500 టన్నుల సీ ఫుడ్, 18 వేల టన్నుల కూరగాయలు, 20 వేల టన్నుల పండ్లు వస్తుంటాయట. ఈ మార్కెట్ నుంచి కోయంబేడు మార్కెట్ లో మాదిరే దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఇవన్నీ రవాణా అవుతుంటాయి. కొత్తగా కరోనా వైరస్ ఈ ప్రాంతంలో కనిపించడంతో.. ఇరవైనాలుగు గంటలూ కాపలా ఉండేలా గార్డులను పెట్టి ఈ మార్కెట్ ని మూసివేశారు. ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం ఫెంగ్ తాయ్ జిల్లాను’ వార్ టైమ్ ఎమర్జెన్సీ మోడ్’ లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఎందుకైనా మంచిదని దీని చుట్టుపక్కలగల మార్కెట్లను కూడా క్లోజ్ చేశారు.