కరోనా మహమ్మారి కాటేయడంతో.. బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోహసిన్ చౌదరి మరణించారు. గత మే నెల 29వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు. జూన్ 6వ తేదీన ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. సోమవారం నాడు మరణించారు. ఉదయం 9.30 గంటలకు మరణించినట్లు బంగ్లాదేశ్ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు 1.37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,738 మంది మరణించారు.