91 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకుంటున్న ప్రొఫెసర్‌

|

Sep 17, 2020 | 12:32 PM

చాలా మంది వృత్తిని ఉదరపోషణార్థంగానే భావిస్తారు.. చాలా కొద్ది మంది మాత్రమే వృత్తిని దైవంగా భావిస్తారు.. ఆ కొద్ది మందిలో మీరు ఫోటోలో చూస్తున్న ప్రొఫెసర్‌ కూడా ఒకరు.. ఆయనకు 91 ఏళ్ల వయసుంటుంది.. ఈ వయసులో కూడా ఆయన ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకుంటున్నారు.. నిజంగా టీచింగ్‌ అనేది ఓ ప్యాషన్‌ ఈయనకు! ఊపిరి ఉన్నంత వరకు పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉంటానంటున్నారాయన. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో స్కూళ్లకు తాళాలు పడ్డాయి.. స్కూళ్లనైతే మూసేశారు కానీ […]

91 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకుంటున్న ప్రొఫెసర్‌
Follow us on

చాలా మంది వృత్తిని ఉదరపోషణార్థంగానే భావిస్తారు.. చాలా కొద్ది మంది మాత్రమే వృత్తిని దైవంగా భావిస్తారు.. ఆ కొద్ది మందిలో మీరు ఫోటోలో చూస్తున్న ప్రొఫెసర్‌ కూడా ఒకరు.. ఆయనకు 91 ఏళ్ల వయసుంటుంది.. ఈ వయసులో కూడా ఆయన ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకుంటున్నారు.. నిజంగా టీచింగ్‌ అనేది ఓ ప్యాషన్‌ ఈయనకు! ఊపిరి ఉన్నంత వరకు పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉంటానంటున్నారాయన. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో స్కూళ్లకు తాళాలు పడ్డాయి.. స్కూళ్లనైతే మూసేశారు కానీ విద్యాసముపార్జనకు తాళాలు వేయలేరు కదా! అందుకే వర్చువల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ యూనివర్సిటీలో అర్థశతాబ్దం నుంచి ఈయన ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.. వర్చువల్‌ క్లాసులను కూడా క్లాస్‌లో పాఠాలు చెబుతున్నట్టుగానే నీట్‌గా డ్రస్సప్‌ అయ్యి, షూలు వేసుకుని మరి తీసుకుంటున్నారు.. వృత్తిమీద ఆయనకు ఉన్న అభిరుచి అలాంటిది. ఈ ఫోటోను ఆయన కూతురు జులియా క్రోన్‌ మెక్లింగ్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.. ఆమె అన్నట్టుగానే ఈయనగారి క్లాసులు వినడానికి పిల్లలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా! ఆమె ఫోటోను పెట్టగానే 62 వేలకు పైగా లైకులు పడ్డాయి.. 23 వేల మంది షేర్‌ చేశారు.. ఈయన క్లాసులు వినేందుకు నెటిజన్లు కూడా తెగ ఉత్సాహపడుతున్నారు.