ఏపీలో టెన్త్ పరీక్షలకు కొత్త రూల్స్ ఇవే.!

|

May 06, 2020 | 12:07 PM

టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంటే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విధ్యార్ధులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదో తరగతి […]

ఏపీలో టెన్త్ పరీక్షలకు కొత్త రూల్స్ ఇవే.!
Follow us on

టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంటే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విధ్యార్ధులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదో తరగతి పరీక్షల నిర్వహణపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.

కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగియనుంది. లాక్ డౌన్ ఎత్తేసిన రెండు వారాలకు టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ దిశగా షెడ్యూల్ సిద్దం చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్న నేపధ్యంలో పరీక్షల నిర్వహణతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు మార్గదర్శకాలను పాటించనుంది. గతంలో మాదిరిగా కాకుండా ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకోబోతున్నారు. విద్యార్ధులకు మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండటంతో పాటుగా ప్రతీ బెంచ్‌కు ఒక విద్యార్ధి మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.