Telugu News CoronaVirus Ap lockdown 44 new corona cases reported in ap total 647 positive for covid 19
ఏపీలో మరో 44 కరోనా కేసులు : మొత్తం 647
ఏపీలో కరోనా కోరల్లో చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది.
ఏపీలో కరోనా కోరల్లో చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు హైల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఇక కర్నూలు, గుంటూరు జిల్లాలకు పోటీగా విజయవాడలోనూ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతూ కోవిడ్ ఘంటికలు మోగిస్తోంది.
విజయవాడ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం విజయవాడలోనే కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది. దీంతో విజయవాడ నగర వ్యాప్తంగా ఆరు రెడ్ జోన్లను ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. నగరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తునన పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. రెడ్‌జోన్‌లలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నందు వల్లే కేసులు పెరుగుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వివరించారు. రెడ్ జోన్ల పరిధిలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనాపై అవగాహనకు మొబైల్ వాహనాల్లో పోలీసు సిబ్బంది తిరుగుతారని సీపీ వెల్లడించారు.