విమానాల్లో వచ్చేవారి కోసం ఏపీ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌..!

|

May 25, 2020 | 8:09 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండు నెలల పాటు ఆగిపోయిన దేశీయ విమానాలు ఇవాళ్టి నుంచి నింగిలోకి ఎగరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తప్పితే మిగిలిన దేశమంతా విమాన సర్వీసులన్నీ పునః ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని కారణాల వల్ల ఏపీలో రేపటి నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. విమానాల్లో ఏపీకి […]

విమానాల్లో వచ్చేవారి కోసం ఏపీ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌..!
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండు నెలల పాటు ఆగిపోయిన దేశీయ విమానాలు ఇవాళ్టి నుంచి నింగిలోకి ఎగరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తప్పితే మిగిలిన దేశమంతా విమాన సర్వీసులన్నీ పునః ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని కారణాల వల్ల ఏపీలో రేపటి నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

విమానాల్లో ఏపీకి వచ్చేవాళ్లు వీటిని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఎవరైతే రాష్ట్రానికి రావాలనుకుంటున్నారో వారు ముందుగా ‘స్పందన’ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని.. వాటిని ప్రభుత్వం పరిశీలించి అనుమతించిన తర్వాతే టికెట్లు కొనుక్కోవాలని తెలిపింది. అటు రాష్ట్రానికి వచ్చాక కరోనా టెస్టులు చేస్తారని.. లక్షణాలు ఉంటే ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉంచుతారంది. కాగా, వారం తర్వాత రిపోర్టు నెగటివ్ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని.. ఒకవేళ పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.