కరోనాకు బలైన తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్

|

Sep 11, 2020 | 3:06 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఇకలేరు. పదిరోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన చివరికి ప్రాణాలొదిలారు...

కరోనాకు బలైన తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్
Follow us on

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఇకలేరు. పదిరోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన చివరికి ప్రాణాలొదిలారు. ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా మారడంతో నాలుగు రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. రామానుజయ స్వస్థలం కృష్ణా జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. రామానుజయ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలమలశెట్టి రామానుజయ మృతితో టీడీపీ ఓ సమర్థుడైన నేతను కోల్పోయిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల నుంచి మహిళల స్వయం ఉపాధి పథకాల రూపకల్పన వరకు రామానుజయ ప్రధానభూమిక పోషించారని కొనియాడారు. కాపుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని టీడీపీ నేతలు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.