AP Corona Cases: రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గత 24 గంటల్లో..

|

Jan 12, 2022 | 5:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో (మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు) 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు..

AP Corona Cases: రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గత 24 గంటల్లో..
Follow us on

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో (మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు) 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,205 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,84,984కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది.

కాగా.. గత 24 గంటల్లో 281 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,63,255 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఏపీలోని రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరులో 607 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నంలో 695 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరులో 203, విజయనగరంలో 212 కేసులు, గుంటూరులో 224 కేసులు చొప్పున నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..