AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల రేటు పెరిగింది.. గత 24 గంటల్లో..

|

Jan 28, 2022 | 5:29 PM

ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. చాలా జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల రేటు పెరిగింది.. గత 24 గంటల్లో..
Follow us on

Andhra Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. చాలా జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 40,635 శాంపిల్స్ ని పరీక్షించగా 12,561మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 224571 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా విశాఖపట్నం(Vizag) జిల్లాలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు, అనంతపురం(Anantapur District), చిత్తూరు జిల్లా(Chittoor)లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14591కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 113300 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 8742 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2117822కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,23,65,775 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1710 కొత్త కేసులు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలో కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..


ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..