AP Corona Cases: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం..

|

Feb 10, 2022 | 6:01 PM

సుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. జాగ్రత్తలు మాత్రం పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 26,393 శాంపిల్స్ ని పరీక్షించగా 1,345 మందికి కరోనా సోకినట్లు తేలింది. 

AP Corona Cases: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం..
Follow us on

Andhra Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతోంది. నిన్నటి కంటే ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. జాగ్రత్తలు మాత్రం పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 26,393 శాంపిల్స్ ని పరీక్షించగా 1,345 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2307072కి చేరింది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 14683కు చేరింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 40884 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 6,576 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2251505కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,27,59,439 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 309 కొత్త కేసులు వెలుగుచూశాయి. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా వ్యాప్తి ఎక్కువగానే ఉంది.

జిల్లాల వారీగా లెక్కలు..
ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 309 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లాలో184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం – 51, చిత్తూరు – 83, గుంటూరు – 132, వైఎస్ఆర్ కడప – 56, కర్నూలు – 62, నెల్లూరు – 58, ప్రకాశం – 87, శ్రీకాకుళం – 22, విశాఖపట్నం – 110, విజయనగరం – 16, పశ్చిమ గోదావరి – 175 చొప్పున మొత్తం 1,679 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.

● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు

వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు…

UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 35.03 శాతం ఓటింగ్‌