రూ.100 ఫైన్ తీసుకుని.. వాహనాలను విడిచిపెట్టండి..

|

May 24, 2020 | 12:13 AM

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చాలామంది వాహనదారులు నిబంధనలు ఉల్లఘించి రోడ్డెక్కారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ జరిగింది. అలాంటివారిపై కేసులు నమోదు చేసి… పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిస్తుండటంతో సీజ్ చేసిన వాహనలన్నింటిని తిరిగి ఇచ్చేయాలని ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వాహనదరులను నుంచి కేవలం రూ. 100 ఫైన్ మాత్రమే వసూలు చేయాలని […]

రూ.100 ఫైన్ తీసుకుని.. వాహనాలను విడిచిపెట్టండి..
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చాలామంది వాహనదారులు నిబంధనలు ఉల్లఘించి రోడ్డెక్కారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ జరిగింది. అలాంటివారిపై కేసులు నమోదు చేసి… పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిస్తుండటంతో సీజ్ చేసిన వాహనలన్నింటిని తిరిగి ఇచ్చేయాలని ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

వాహనదరులను నుంచి కేవలం రూ. 100 ఫైన్ మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. అంతేకాకుండా మరోసారి ఇలా నిబంధనలను ఉల్లంఘించబోమంటూ వాహనదారులు నుంచి హమీపత్రాన్ని తీసుకోవాలని పోలీసులను జగన్ సూచించారు. అదే విధంగా వాహనాలను తిరిగి ఇచ్చేటప్పుడు వాహనదారులకు కరోనా వైరస్‌ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.

Read This: వాహనదారులకు ఊరట.. ఏపీలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్..