Andhra Pradesh today covid-19 Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు Pమెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ గణనీయం తగ్గుముఖం పట్టాయి. అయితే, మృతుల సంఖ్య మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఇక కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా, కొత్తగా 1,540 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, ఈ ఒక్క రోజులోనే 19 మంది కోవిడ్‌ను జయించలేక ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఇదిలావుంటే, కరోనా వైరస్ నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 2,304 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది.
ఇక, వివిధ జిల్లాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…