
ఏపీలో కరోనా విజృంభణ పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిని దాటేయగా.. తాజాగా 24 గంటల్లో 81 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 60 మంది కోలుకోగా.. 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరింది. వీరిలో 231 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మృత్యువాతపడ్డారు. 835 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక హెల్త్ బులెటిన్ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా.. అనంతపురంలో 2, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 3, కడపలో 3, కృష్ణలో 52, కర్నూల్‌లో 4, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా విజృంభణ పెరుగుతోన్న నేపథ్యంలో మరోవైపు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు డా. శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజ వేశాయని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయని ఆయన అన్నారు.
Read This Story also: జాతీయ అవార్డులపై కరోనా ఎఫెక్ట్.. నిరవధిక వాయిదా..!