Andhra Pradesh Covid19: ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 60,350 నమూనాలను పరీక్షించగా కొత్తగా 1,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20,07,330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 1,296 మంది కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సం పూర్ణ ఆరోగ్య వంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,797గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇదిలావుంటే, రాష్ట్రంలో గత 24గంటల్లో 8 మంది కరోనా రాకాసి కోరలకు బలయ్యారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 14,052కి చేరింది. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో 2,75,96,989 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 272, తూర్పుగోదావరి జిల్లాలో 206, గుంటూరు జిల్లాలో 132, కడప జిల్లాలో 60, కృష్ణాజిల్లాలో 162, కర్నూలు జిల్లాలో 05, నెల్లూరు జిల్లాలో 201, ప్రకాశం జిల్లాలో 120, శ్రీకాకుళం జిల్లాలో 28, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 129 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.
Read Also…