ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా 261 మందికి పాజిటివ్, ఒకరు మృతి

|

Mar 16, 2021 | 9:26 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన తెలుగు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా 261 మందికి పాజిటివ్, ఒకరు మృతి
AP Corona Updates
Follow us on

AP Corona cases  : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన తెలుగు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 23,417 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 261 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,92,269కి చేరుకుంది.గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు నమోదు కాగా… విశాఖపట్టణం జిల్లాలో 39 కేసులు, చిత్తూరు జిల్లాలో 37 కేసులు, కృష్ణా జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు గత 24 గంటల్లో ఒకరు కరోనా రాకాసి కోరల్లో చిక్కుకుని ప్రాణాలను విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇక, కరోనా జయించిన వారిలో గత 24 గంటల్లో 125 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,83,505 మంది కోలుకున్నారు. ఇక, మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,45,80,783 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Coronavirus Cases On March 16

Read Also…  మహారాష్ట్రలో మళ్లీ విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం