Omicron Tension: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్!

|

Dec 07, 2021 | 5:15 PM

భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలవర పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.

Omicron Tension: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్!
Follow us on

Srikakulam Covid 19 Omicron Variant: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సౌతాఫ్రికాలో మొదలైన మహమ్మారి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలవర పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు.

ఉమిలాడ గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు.. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. అతన్ని హుటాహుటీన శ్రీకాకుళం రిమ్స్కు తరలించిన అధికారులు.. ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అతనికి లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ ను రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ జిల్లాలో వచ్చిందనే టెన్షన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు సమాచారం. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే, జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాదం స్పష్టం చేశారు. ఆ వ్యక్తికి రెండు సార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేసాం. రక్త నమూనాలను జినోమ్ సీక్వెన్స్ కి పంపించామని, పూర్తి నివేదికలు వస్తే గానీ ఒమిక్రాన్‌గా నిర్ధారించలేమని ఆయన తెలిపారు.

Read Also….  Crime News: రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష.. 28 రోజుల్లో తీర్పు వెలువరించిన కోర్టు