ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా..

| Edited By:

Jun 12, 2020 | 2:18 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 200కు పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5636కు చేరింది. 

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా..
Follow us on

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 200కు పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5636కు చేరింది.  ఇందులో రాష్ట్రంలో కొత్తగా 141 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించకపోగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. అలాగే 2465 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 11,775 పరీక్షలు నిర్వహించగా.. అందులో 141 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4402కు చేరింది.  వారిలో 59 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 2599కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 1723 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా ఇద్దరికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 199కు చేరింది. అందులో 178 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 64 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1035కు చేరింది. వీరిలో 564 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా పరీక్షలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Read This Story Also: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. శాశ్వతంగా మూతపడబోతున్న ప్రముఖ థియేటర్..!