Andhra corona News: ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 30,678 నమూనాలను టెస్ట్ చేయగా 1,326 మందికి కరోనా సోకినట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 282 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171 కరోనా కేసులు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లాలో 138, ప్రకాశం జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 52, కడప జిల్లాలో 31, తూర్పుగోదావరి జిల్లాలో 29, అనంతపురం జిల్లాలో 23 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం బులెటిన్ రిలీజ్ చేసింది. తాజా సంఖ్యతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,09,002 కి చేరింది.
24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఐదుగురు ప్రాణాలు విడిచారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 7,244కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 911 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,39,114 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్ ద్వారా వెల్లడించింది.
#COVIDUpdates: 05/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,06,107 పాజిటివ్ కేసు లకు గాను
*8,88,153 మంది డిశ్చార్జ్ కాగా
*7,244 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,710#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/leYPpwoGR8— ArogyaAndhra (@ArogyaAndhra) April 5, 2021
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?
అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు.. ఇప్పటివరకు ఎంతమంది అంటే..?