AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల..

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Updated on: Jan 31, 2021 | 6:39 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41, 910 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 116 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, ఇవాళ కరోనా కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,87,836 మంది కరోనా బారిన పడగా, 7,153 మంది మృత్యువాత పడ్డారు. 8,79,405 మంది కరోనా జయించి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,278 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా రాష్ట్ర వ్యా్ప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా పరిధిలో 24 నమోదు అయ్యాయి. ఆ తరువాత చిత్తూరు 17, గుంటూరు 13, విశాఖపట్నం 13, పశ్చిమగోదావరి 13 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

వృద్దురాలిని సిటీ బయట వదిలేసిన ఇండోర్ మున్సిపల్ ఉద్యోగుల తొలగింపు.

OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..