ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతుంది. కొత్తగా రాష్ట్రంలో 72,979 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 15,284 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. తాజాగా మరో 106 మంది కరోనా కారణంగా మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 10,328కి పెరిగింది. తాజాగా 20,917 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌లో తెలపింది. ఇప్పటి వరకు 1,87,49,201 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా కొత్తగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి,నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున మరణించారు.
Also Read:మండుటెండలో నడిరోడ్డుపై దాహంతో ఉన్న గద్దకు నీళ్లు అందించిన బాటసారులు.. నెటిజన్ల ప్రశంసలు