సోనమ్ పాడిన సాంగ్ విన్నారా…

సోనమ్ కపూర్ పరిచయం అక్కరలేని బాలీవుడ్ అందాల తార. తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని బాగానే రాణిస్తోంది. అంతేకాదు పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజాని 2018లో వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైపోయారు. అయితే సోనమ్ తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఇంటి మొత్తాన్ని అలంకరించి ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంలో సోనమ్ భర్త ఆనంద్ అహుజా ఓ వీడియోను తన […]

సోనమ్ పాడిన సాంగ్ విన్నారా...

Updated on: Jun 11, 2020 | 7:26 PM

సోనమ్ కపూర్ పరిచయం అక్కరలేని బాలీవుడ్ అందాల తార. తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని బాగానే రాణిస్తోంది. అంతేకాదు పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజాని 2018లో వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైపోయారు. అయితే సోనమ్ తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఇంటి మొత్తాన్ని అలంకరించి ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంలో సోనమ్ భర్త ఆనంద్ అహుజా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ విషెస్ తెలిపారు.

అహుజా తీసిన వీడియోలో సోనమ్‌ కపూర్ పాటలు పాడుతూ వర్కవుట్‌ చేస్తున్నారు. అయితే సోనమ్ పాడిన పాట అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ సోనమ్ మాత్రం తన భర్తపై ప్రేమను వ్యక్తం చేశారు.