లాక్‌డౌన్‌ సీరియల్స్‌.. మరో ఇతిహాసంతో మీ ముందుకు..

| Edited By:

Apr 24, 2020 | 6:06 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దేశ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీవీ సీరియల్స్‌, మూవీ షూటింగ్స్‌ అన్నీ వాయిదా పడ్డాయి. ఇక చేసేదేమీ లేక.. పాత కార్యక్రమాలను, పాత టీవీ సీరియల్స్‌ను పునః ప్రసారం చేస్తున్నాయి పలు ఛానెల్స్. ఇందులో దూరదర్శన్‌ ఇప్పటికే రామాయణ్‌,మహాభారత్ సీరియల్స్‌ను పునఃప్రసారం చేస్తోంది. తాజాగా.. ఇందులో మరో సీరియల్ కూడా చేరబోతోంది. […]

లాక్‌డౌన్‌ సీరియల్స్‌.. మరో ఇతిహాసంతో మీ ముందుకు..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దేశ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీవీ సీరియల్స్‌, మూవీ షూటింగ్స్‌ అన్నీ వాయిదా పడ్డాయి. ఇక చేసేదేమీ లేక.. పాత కార్యక్రమాలను, పాత టీవీ సీరియల్స్‌ను పునః ప్రసారం చేస్తున్నాయి పలు ఛానెల్స్. ఇందులో దూరదర్శన్‌ ఇప్పటికే రామాయణ్‌,మహాభారత్ సీరియల్స్‌ను పునఃప్రసారం చేస్తోంది. తాజాగా.. ఇందులో మరో సీరియల్ కూడా చేరబోతోంది. ఎంతో మంది ప్రజల్ని ఆకట్టుకున్న శ్రీ కృష్ణ సీరియల్‌ కూడా ఇప్పుడు ప్రజల ముందకు తిరిగి తీసుకొచ్చేందుకు దూరదర్శన్‌ ప్రసారం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రసార భారతి ఓ ట్వీట్ కూడా చేసింది.

తొలుత 90వ దశకంలో ప్రసారమైన ఇతిహాస సీరియల్ “శ్రీకృష్ణ”ని తిరిగి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ట్వీట్‌లో పేర్కొంది. 1993-1996 మధ్య ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. అప్పట్లో దీని రేటింగ్‌ బాగా ఉండేది. అప్పుడు ఇది డీడీ2లో ప్రసారమయ్యేది. ఇక ఆ తర్వాత 1996లో డీడీ నేషనల్‌ మళ్లీ మొదటి నుంచి ఈ సీరియల్‌ను ప్రసారం చేసింది. తాజాగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి మరోసారి ప్రజల ముందకు శ్రీ కృష్ణ సీరియల్‌ రాబోతుంది.