‘ఆరోగ్య సేతు.. ఓ అధునాతన నిఘా సిస్టం’.. రాహుల్ ఫైర్

కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు యాప్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అధునాతన నిఘా సిస్టం గా అభివర్ణించారు. ఎలాంటి సంస్థాగతమైన దూరదృష్టి లేకుండా ఓ ప్రయివేట్ ఆపరేటర్ కి దీన్ని ఔట్ సోర్స్ కి ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు. ఇది సీరియస్ డేటా సెక్యూరిటీకి, ప్రైవసీ సంబంధ ఆందోళనకు దారి తీసేదిగా ఉందన్నారు. టెక్నాలజీ మనకు సురక్షితమైనదే అయినా.. ప్రజల అనుమతి లేనిదే వారిని ట్రాక్ చేసి భయపెట్టరాదని […]

ఆరోగ్య సేతు.. ఓ అధునాతన నిఘా సిస్టం.. రాహుల్ ఫైర్

Edited By:

Updated on: May 02, 2020 | 8:38 PM

కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు యాప్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అధునాతన నిఘా సిస్టం గా అభివర్ణించారు. ఎలాంటి సంస్థాగతమైన దూరదృష్టి లేకుండా ఓ ప్రయివేట్ ఆపరేటర్ కి దీన్ని ఔట్ సోర్స్ కి ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు. ఇది సీరియస్ డేటా సెక్యూరిటీకి, ప్రైవసీ సంబంధ ఆందోళనకు దారి తీసేదిగా ఉందన్నారు. టెక్నాలజీ మనకు సురక్షితమైనదే అయినా.. ప్రజల అనుమతి లేనిదే వారిని ట్రాక్ చేసి భయపెట్టరాదని ఆయన అన్నారు. దీనివల్ల భయం మరింత పెరుగుతుందన్నారు. ఆరోగ్య సేతు యాప్ కి ఇంకా ఎంతో డేటా అవసరమని, ఇతర దేశాలు రూపొందించిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ లతో పోల్చితే ఇది నాసిరకమైన ప్రమాణాలతో ఉందని ఆయన విమర్శించారు. ఇది వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించడం, దాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించడం తెలిసిందే.