ఆరు నెల‌ల్లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ప్ర‌ణాళికః యోగి

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు అమ‌లు చేస్తున్నారు...జూన్ 15నాటికి మొత్తం 75 జిల్లాల్లో ట్రూనాట్ యంత్రాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. క‌రోనాపై అధికారుల‌తో నిర్వ‌హించిన సమీక్షా స‌మావేశంలో ఆయ‌న

ఆరు నెల‌ల్లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ప్ర‌ణాళికః యోగి

Updated on: Jun 11, 2020 | 10:29 AM

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు అమ‌లు చేస్తున్నారు. వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే లక్ష్యంగా సీఎం యోగి అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో క‌రోనా బాధితుల‌కు టెస్టులు త్వ‌రిత‌గ‌తిన నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన యంత్రాల‌ను అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జూన్ 15నాటికి మొత్తం 75 జిల్లాల్లో ట్రూనాట్ యంత్రాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. క‌రోనాపై అధికారుల‌తో నిర్వ‌హించిన సమీక్షా స‌మావేశంలో ఆయ‌న ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద‌ర్బంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం కూడా సీఎం ప్ర‌క‌టించారు.

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో స్వరాష్ట్రానికి చేరుకున్న వ‌ల‌స కూలీలు, కార్మికులకు భ‌రోసా క‌ల్పించే నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. రాబోయే ఆర్నెళ్ల కాలంలో రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు క‌ల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు సీఎం యోగి. సీఎం నిర్ణ‌యంతో ఎంతోమంది కూలీలు, కార్మికులకు మేలు జ‌ర‌గ‌నుంది.