కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు సింగిల్ డిజిట్ తో ఉన్న ఈ సంఖ్య.. రెండంకెలకు చేరుకుంది. తాజాగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మృతిచెందాడు. దీంతో దేశంలో కరోనా ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో.. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి.
Maharashtra: A 65-year-old Coronavirus patient from UAE passed away in Mumbai yesterday. He was admitted in Kasturba Hospital. https://t.co/PSz1nXNavV
— ANI (@ANI) March 24, 2020