తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు ఇవే.. జీహెచ్‌ఎంసీలో..

| Edited By:

Jun 02, 2020 | 10:16 PM

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు వందకు పైగా ఉన్న కేసుల సంఖ్య.. సోమవారం నాడు వందకు కిందికి దిగింది.

తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు ఇవే.. జీహెచ్‌ఎంసీలో..
Follow us on

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు వందకు పైగా ఉన్న కేసుల సంఖ్య.. సోమవారం నాడు వందకు కిందికి దిగింది. ఇక మంగళవారం నాడు కూడా వంద లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా మరో 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు వచ్చినవి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్‌ నగర్‌లో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో1, నల్గొండ జిల్లాలో 2,మంచిర్యాల 1, సంగారెడ్డి 1,సిద్దిపేటలో 1 కేసు నమోదైంది. మంగళవారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2891కి చేరింది. ఇక ఇవాళ కరోనా బారినపడి నలుగురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 92కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1526 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా.. 1273 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 02.06.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/NWGzHGHrW9

— Eatala Rajender (@Eatala_Rajender) June 2, 2020