తెలంగాణలో పెరుగుతున్నకరోనా మరణాలు.. తాజాగా మరో 8 మంది..

| Edited By:

Jun 05, 2020 | 9:22 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులగా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. ఇప్పుడు రోజూ వంద మార్క్‌ను టచ్ చేస్తోంది.

తెలంగాణలో పెరుగుతున్నకరోనా మరణాలు.. తాజాగా మరో 8 మంది..
Follow us on

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులగా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. ఇప్పుడు రోజూ వంద మార్క్‌ను టచ్ చేస్తోంది. అంతేకాదు.. అటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గురువారం నాటికి వంద మార్క్‌ను దాటేసింది. ఇక శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 1627 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్జార్జ్ కాగా.. మరో 1,550 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఎనిమిది మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 113కి చేరింది.

ఇక.. రోజు నమోదవుతున్న కేసుల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌ నుంచే అత్యధికంగా నమోదవుతుండటం కలకలం రేపుతోంది. శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116 నమోదవ్వగా.. రంగారెడ్డి 8, ఆదిలాబాద్ 2,మేడ్చల్ 2, సంగారెడ్డి 2,
ఖమ్మం 2,వరంగల్ 3,మహబూబ్ నగర్5,మంచిర్యాల 1,కరీంనగర్‌లో 2 కేసులు నమోదయ్యాయి.