“మహా” పోలీసులను వణికిస్తున్న కరోనా.. వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు..

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వణికిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇక పోలీసులు కూడా ఇక్కడే అత్యధికంగా కరోనా..

మహా పోలీసులను వణికిస్తున్న కరోనా.. వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు..

Edited By:

Updated on: Jul 01, 2020 | 5:21 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వణికిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇక పోలీసులు కూడా ఇక్కడే అత్యధికంగా కరోనా బారినపడుతున్నారు. రోజు పదుల సంఖ్యలో పోలీసు సిబ్బంది కరోనా బారినపడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 77 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,015 మంది పోలీసులు కరోన బారినపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతేకాదు.. కరోనా బారినపడి మరణిస్తున్న పోలీసు సిబ్బంది సంఖ్య కూడా నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటికే అరవై మంది సిబ్బంది కరోనా బారినపడి మరణించారు. గడిచిన 24 గంటల్లో ఓ సిబ్బంది కరోనా బారినపడి మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అటు ముంబై నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో పోలీసు సిబ్బంది కూడా ఉంటున్నారు.