
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అందులో ముఖ్యంగా ముంబై నగరంలోనే వస్తున్నాయి. అయితే ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ధారవి మురికి వాడలో కరోనా మహమ్మారి ఒకప్పుడు విజృంభించింది. అయితే అంతే త్వరగా అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి అక్కడ కేసుల సంఖ్య అత్యల్పంగా నమోదవుతుండటంతో.. ముంబై మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా మంగళవారం నాడు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఇక్క్డడ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2268కి చేరింది. ఈ విషయాన్ని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ తెలిపింది.
6 new #COVID19 positive cases reported from Dharavi area of Mumbai today, taking the total number of cases to 2268: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/Evr33OZULK
— ANI (@ANI) June 30, 2020