India Corona Cases Update: భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజు కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,211 కొత్త కరోనా కేసుల సంఖ్య నమోదు అయ్యాయి. అదే సమయంలో 37,028 మంది డిశ్చార్జ్ అవగా.. 271 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,40,720 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,20,95,855 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,13,93,021 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా 1,62,114 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కాగా, దేశ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వరకు 7,85,864 మంది శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 24,26,50,025 శాంపిల్స్ సేకరించి టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కేసులు నమోదు అవగా.. అంతటి స్థాయిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతండటం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6.11 కోట్ల వ్యాక్సిన్‌ను వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
Also read: