మహారాష్ట్రలో కరోనా కేసులు.. తాజా రిపోర్ట్స్‌ చూస్తే షాక్ తినాల్సిందే..

| Edited By:

Apr 28, 2020 | 7:24 PM

లాక్‌డౌన్ ముగింపు తేదీ దగ్గరపడుతున్నా కూడా.. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. అటు మరణాల విషయంలో కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మంగళవారం నమోదైన కేసులను చూస్తే షాక్‌ తినాల్సి వస్తుంది. ఏకంగా 522 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు […]

మహారాష్ట్రలో కరోనా కేసులు.. తాజా రిపోర్ట్స్‌ చూస్తే షాక్ తినాల్సిందే..
Follow us on

లాక్‌డౌన్ ముగింపు తేదీ దగ్గరపడుతున్నా కూడా.. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. అటు మరణాల విషయంలో కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మంగళవారం నమోదైన కేసులను చూస్తే షాక్‌ తినాల్సి వస్తుంది. ఏకంగా 522 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులను కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8590కి చేరింది. వీరిలో 1282 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాబారిన పడి 369 మంది ప్రాణాలు విడిచిరి

అయితే రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువగా ముంబై,పూణె నగరాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలోని ధారవీ మురికివాడలో కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ముంబై నగరంలో దాదాపు మూడు వేలకు పైగా కేసులు నమోదవ్వడంతో.. అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ తర్వాత పూణెలో కూడా దాదాపుగా ఆరు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఇక ఇక్కడి పరిస్థితులను చూస్తే.. లాక్‌డౌన్‌ ఖచ్చితంగా మరిన్ని రోజులు కొనసాగించే పరిస్థితి ఉంది.