అక్కడ గ్రీన్‌జోన్స్‌లో.. రేపటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు..
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కర్ణాటకలోని గ్రీన్‌జోన్స్‌లో బుధవారం నుంచి దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Karnataka eases curbs: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కర్ణాటకలోని గ్రీన్‌జోన్స్‌లో బుధవారం నుంచి దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. గ్రీన్‌జోన్స్‌గా గుర్తించిన పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అయితే.. కేవలం దుకాణాలు తెరిచేందుకు మాత్రమే అనుమతించామని, షాపింగ్ మాల్స్‌కు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం.. మాస్క్‌లు పెట్టుకోవడం తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
కాగా.. నెల రోజులకు పైగా లాక్‌డౌన్‌తో కర్ణాటక ఆర్థికంగా బాగా నష్టపోయింది. దీంతో.. కొంతైనా ఆర్థిక పరిస్థితి గాడిలో పడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా ఆదేశాలతో కర్ణాటకలో గ్రీన్‌జోన్స్‌గా ప్రకటించబడిన చామరాజనగర్, కొప్పల్, చిక్‌మగళూరు, రాయ్‌చూర్, చిత్రదుర్గ, రామనగర, హస్సన్, శివమొగ్గ, హవేరి, యద్గిర్, కోలార్, దేవనగరె, ఉడుపి, కొడగు ప్రాంతాల్లో బుధవారం నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి.