Covid-19 second wave: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే.. కరోనా బాధితులను రక్షించే వైద్యులపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తంచేసింది.
అయితే.. మరణించిన వారిలో అత్యధికంగా.. దేశ రాజధాని ఢిల్లీలో 103 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, రాజస్థాన్‌లో 39 మంది, ఆంధప్రదేశ్‌లో 29 మంది, జార్ఖండ్‌లో 29 మంది, తెలంగాణలో 29 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో 16 మంది, తమిళనాడులో 18 మంది, పశ్చిమ బెంగాల్‌లో 19 మంది కరోనాతో మరణించారు. కాగా… కరోనా ఫస్ట్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.
కోవిడ్-19 మొదటి, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మృతి చెందారని ఐఎంఏ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఎంఐ రిజిస్ట్రీలో ప్రస్తుతం 3.5లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే.. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షలకుపైగా వైద్యులుంటారని ఐఎంఏ వెల్లడించింది. ఇందులో సుమారు 66 శాతం మందే టీకాలు వేసుకున్నారని.. మిగతా వారు వేసుకోవాల్సి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: